కారు ఇంజన్ తో పాటుగా ఇతర ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయాలంటే, ఆరోగ్యమైన బ్యాటరీ ఉండాల్సిందే. కారులో బ్యాటరీ వీక్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. చిన్నపాటి జాగ్రత్తలను పాటించడం ద్వారా బ్యాటరీ జీవితకాలాన్నిపెంచుకోవచ్చు. బ్యాటరీని తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి, అలాగే కారుకి క్రమం తప్పకుండా సర్వీస్ చేయించాలి. ఎప్పుడూ ఇంజన్ ఆన్ చేయకుండా లైట్స్ ఆన్ చేయవద్దు, కారును ఎక్కువ కాలం నడపకుండా పక్కన ఉంచకూడదు.