జియో తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ తో ఉన్న అన్ని ప్లాన్‌లను తీసివేసింది. తన పోర్ట్‌ఫోలియో నుండి రూ.1499, రూ.4199 రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. ఈ ప్లాన్‌లలో వినియోగదారులు డిస్నీ+హాట్ స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని, జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని ఏడాది పాటు ఉచితంగా పొందుతున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్ లను తీసేయడంతో యూజర్లు ఈ ప్రయోజనాలను కోల్పోనున్నారు.