దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను మేటర్ సంస్థ రూపొందించింది. ఈ బైక్ ఒక్క చార్జ్ తో 150 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇంటిగ్రేటెడ్, హై-ఎనర్జీ డెన్సిటీ, 5 kWh పవర్ ప్యాక్‌ని కలిగి ఉందీ బైక్. అంతేకాదు, మొదటి లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. హైపర్ షిఫ్ట్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఈ బైక్ ప్రత్యేకం. ఇన్ని ప్రత్యేకతల గల ఈ బైక్‌ను ఇంట్లోనే రూపొందించడం విశేషం. అయితే, మోటార్‌సైకిల్ పేరును మేటర్ సంస్థ వెల్లడించలేదు. ధర వివరాలను కూడా బయటకు చెప్పలేదు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది.