ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

sports |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 10:48 AM

విరాట్ కోహ్లీ .. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించాడు.ఎవ్వరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతల్ని తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో  ఏ భారతీయ ఆటగాడికి సాధ్యం కాని మరో చారిత్రాత్మక రికార్డును ఈ రన్ మెషీన్ నమోదు చేశాడు.ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 64.36 సగటుతో మొత్తం 708 పరుగులు చేశాడు. దీంతో.. రెండు ఐపీఎల్ సీజన్లలో 700+ స్కోర్లు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 2016 సీజన్‌లో 973 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఓవరాల్‌గా మాత్రం కోహ్లీ ఈ ఫీట్‌ని సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కన్నా ముందు క్రిస్ గేల్ రెండుసార్లు 700+ స్కోర్లు చేశాడు. 2012లో 733 పరుగులు చేసిన ఆ వెస్టిండీస్ ఆటగాడు, ఆ తదుపరి సీజన్‌లోనూ (2013) అదే దూకుడు కొనసాగించి 708 పరుగులు చేశాడు.


ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. పాఫ్ డు ప్లెసిస్ (54) అర్థశతకంతో రాణించడంతో పాటు కోహ్లీ (47), రజత్ (41), గ్రీన్ (38) మెరుపులు మెరిపించడం వల్లే ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. సీఎస్కే 7 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితం కావడంతో, ఓటమిపాలైంది. మొదట్లో రచిన్ రవీంద్ర (61) దుమ్ముదులిపేయగా.. చివర్లో జడేజా (42 నాటౌట్), ధోనీ (23) గట్టిగానే పోరాడారు కానీ.. చివరికి ఫలితం లేకుండా పోయింది.


కోహ్లీ సాధించిన మరిన్ని రికార్డులు


* ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 708 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ 155.60. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్ట్రైక్‌రేట్‌.


* 2016లో 973 పరుగులు చేసిన కోహ్లీ.. ఇప్పటికీ ఒక సీజన్‌లో హయ్యస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


* లీగ్‌ దశ ముగిసే సమయానికి కోహ్లీ 37 సిక్సులు కొట్టి.. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.


* భారత్‌ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కోహ్లీనే. సీఎస్కేపై ఇన్నింగ్స్‌తో 9000+ స్కోరును దాటేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com