జపాన్‌లో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన కోబ్-2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి అథ్లెట్‌గా నిలిచింది.ఉమెన్స్ టీ -20 కేటగిరి 400 మీటర్ల పరుగులో కేవలం 55.07 సెకండ్స్‌లో పూర్తిచేసి బంగారు పతకం సాధించింది. 2024 పారిస్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌కు అర్షత సాధించి కేవలం 20 సంవత్సరాల వయసులోనే అతిపెద్ద మైలురాయిని అందుకుంది. ప్రపంచ రికార్డు క్రియేట్ చేసి తెలంగాణకు పేరు తీసుకువచ్చిన దీప్తిని పారా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా, పారా స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గడిపెల్లి ప్రశాంత్, కోచ్ నాగపురి రమేశ్, ప్రెసిడెంట్ సింగారపు బాబు అభినందించారు.