టీ20 వరల్డ్‌కప్ లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన పోరులో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.టాస్ గెలిచి బౌలింగ్ ఉంచుకున్న భారతజట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఐర్లాండ్ జట్టును 97 పరుగులకే కట్టడి చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 97 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి 12.2 ఓవర్లలో చేరుకుని విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్గ్‌గా నిలిచాడు. మ్యాచ్ ను సిక్సర్ తో ఫినిష్ చేశాడు.
అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. ఓపెనర్‌గా దిగిన వస్టార్ బ్యాట్స్‌మన్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అయినా రోహిత్ శర్మ , తర్వాత వచ్చిన రిషబ్ పంత్ పట్టుకోల్పోకుండా ఆడి జట్టును గెలుపువైపు నడిపించారు. హాప్ సెంచరీ చేశాక రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఆడలేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం చివర వరకు ఉంది టీమి ఇండియాకు విజయాన్ని అందించాడు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో మెరిశాడు. బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. సిరాజ్, అక్షర్ పటేల్ లు తలా ఒక వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరత్ డెలానీ 16 బంతుల్లో 27 నాటౌట్ గా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన అర్ష్ దీప్ సింగ్ ఐర్లాండ్ ను కుప్పకూలడంలో ముఖ్య పాత్ర పోషించాడు.