వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూపు-సీలో భాగంగా మంగళవారం సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 98 పరుగులు చేశాడు.6 ఫోర్లు, 8 సిక్స్‌లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పూరన్ విధ్వంసంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) నిరాశారిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43)కు నికోలస్ పూరన్ తోడవ్వడంతో విండీస్ స్కోర్ పరుగులు పెట్టింది. హాఫ్ సెంచరీ ముందు చార్లెస్ పెవిలియన్ చేరినా.. 31 బంతుల్లో పూరన్ అర్ధ శతకం చేశాడు. ఇనింగ్స్ చివరలో పూరన్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. రషీద్ ఖాన్ వేసిన 18 ఓవర్లో ఏకంగా 24 రన్స్ బాదాడు. అయితే చివరి ఓవర్లో రెండు సిక్సులు బాదిన పూరన్.. అనూహ్యంగా రనౌట్ అయి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. హోప్ (25), పావెల్ (26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ఓడిపోయింది. ఇబ్రహీం జద్రాన్ (38) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ మూడు వికెట్స్ తీశాడు.