పసికూన జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. ఒక్కసారిగా భారత క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న ఫ్యాన్స్‌కు..యంగ్ టీమిండియా ఓటమి ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే.. దెబ్బతిన్న పులిలా కుర్రాళ్లు జింబాబ్వేపై రెండో టీ20లో విరుచుకుపడ్డారు. ఎక్కువ గ్యాప్ లేకుండా శనివారం తొలి మ్యాచ్ జరగ్గా.. ఆదివారం రెండో టీ20 జరిగింది. శనివారం ఎదురైన ఓటమికి.. ఆదివారం మ్యాచ్ అదిరిపోయే రీతిలో బదులుతీర్చుకుంటి భారత యువ జట్టు. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
తొలి మ్యాచ్‌లో డకౌట్ అయి.. ఊహించని షాకిచ్చిన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు. ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే.. ఈ సెంచరీ వెనుక ఉన్న సీక్రెట్‌ను రివీల్ చేశాడు అభిషేక్ శర్మ. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నా.. కమ్ బ్యాక్ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయినా.. వెంటనే శుబ్‌మన్ గిల్ నుంచి అతని బ్యాట్ తీసుకుంటాను. అతని బ్యాట్‌తో ఆడిన ప్రతిసారి నేను మంచి ప్రదర్శన చేశానని అభిషేక్ తెలిపాడు.ఇప్పుడు కూడా ఈ సెంచరీ అతని బ్యాట్‌తోనే చేశాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన తర్వాత.. రెండో మ్యాచ్ కోసం అతన్ని బ్యాట్ అడిగా.. గిల్ అంత ఈజీగా తన బ్యాట్‌ను ఇవ్వడు, కానీ, ఎలాగోలా అతని నుంచి బ్యాట్ తీసుకుని సెంచరీ సాధించా.. అండర్ 14 నుంచి నాకు ఇబ్బందిగా అనిపించిన ప్రతి సారి అతని బ్యాట్‌తో ఆడటం అలవాటు అయిపోయింది. అది ప్రతిసారి బాగా కలిసి వస్తోంది కూడా అని సెంచరీ హీరో తెలిపాడు. తన బ్యాట్‌తో అభిషేక్ సెంచరీ కొడితే.. గిల్ మాత్రం రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన గిల్ రెండో మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్ చేరాడు. మరి మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు యువ క్రికెటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. మరి గిల్ బ్యాట్‌తో ఆడి అభిషేక్ సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.