భారత్, జింబాబ్వే జట్ట మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచింది. అయితే భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లోనే షాక్ ఇచ్చిన జింబాబ్వే సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌తో పాటు మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.
భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌లు నిరాశపర్చిన మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ రెండో టీ20లో సెంచరీ చేసి ఫామ్ లో కొనసాగుతున్నాడు. రుతురాజ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జోరుమీదున్నాడు. యశస్వి సైతం తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ కీలక ఆటగాళ్లు ఇదే జోరుగ కొనసాగిస్తే సిరీస్ కు తిరుగుండదు. బౌలర్ల విషయానికొస్తే.. పేసర్లు అవేష్, ముకేశ్, ఖలీల్ తోపాటు స్పిన్నర్లు బిష్ణోయ్, సుందర్ చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. మూడో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ గాడితప్పినా చివరి వరకు పోరాడితే కట్టడి చేసే అవకాశం ఉంది.