శ్రీలంక టూర్‌కు సంబంధించి టీ20 టీమ్‌ను BCCI గురువారం ప్రకటించింది. జట్టు కూర్పులో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. T20I కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రకటించింది. దీంతో టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా ఇక నుంచి రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపడతారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్‌గా హార్దిక పాండ్యా కొనసాగారు. 2023లో టీ20 టీమ్‌కు పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆశ్చర్యకరంగా ఆయనకు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే కాదు వైస్ కెప్టెన్సీగానూ బాధ్యతలు తొలగించారు. సూర్యకుమార్ యాదవ్ కేవలం ఏడు మ్యాచ్‌లకు మాత్రమే ఇంచార్జీగా వ్యవహరించారు. అందులో ఐదు టీ20లు ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ 300 పరుగులు సాధించారు. కెప్టెన్సీగా బాధ్యతలు ఇచ్చినప్పుడుల్లా సూర్యకుమార్ యాదవ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కెప్టెన్సీగా వ్యవహరించిన మ్యాచ్‌లలో ఆయన రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించారు.
BCCI నియమించిన ఇండియా స్క్వాడ్ ఇదే " సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్" శ్రీలంక టూర్ టీ20 టీమ్‌లో ఉన్నారు.