టీమిండియా కోచ్‌లుగా గతంలో గౌతమ్ గంభీర్‌కు ముందు రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రిలు బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వారెవరికీ రానంత హైప్ గంభీర్ కోచ్‌గా నియమితుడైనప్పుడు వచ్చింది. తాజాగా గంభీర్.. కోచ్ బాధ్యతలను చేపట్టారు. మైదానంలో ఆటగాళ్లకు సూచనలు ఇచ్చారు. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లో గౌతం గంభీర్ నిలిచారు. కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకుంటాడనే వార్త వెలువడ్డప్పటి నుంచి ప్రధానంగా గంభీర్ పేరు తెరపైకి వచ్చింది. అతడు ఐపీఎల్ 2024లో కేకేఆర్ మెంటార్‌గా నియమితుడు కావడం.. అదే సీజన్‌లో టైటిల్ సాధించడంతో దీనికి మరింత ఊతం వచ్చినట్లయింది. కచ్చితంగా గంభీర్‌నే కోచ్ చేయాలనే డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించింది. ఇక హెడ్‌కోచ్‌గా గంభీర్ ప్రస్థానం శ్రీలంకతో పర్యటనలో ప్రారంభమైంది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గౌతీ.. తన ఉద్దేశమేంటో స్పష్టంగా చెప్పాడు. క్రీడల్లో అంతిమంగా విజయానికి విలువ ఉంటుందని కుండ బద్దలు కొట్టాడు.
ఇక టీ20 జట్టుతో కలిసి శ్రీలంకకు బయల్దేరిన గౌతమ్ గంభీర్.. తొలి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించాడు. కోచ్‌గా తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆటగాళ్ల సాధనను పరిశీలిస్తూ, వారికి తగిన సూచనలు ఇస్తూ బిజీ బిజీగా కనిపించాడు. క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న గంభీర్.. టీమిండియా ప్లేయర్లకు సూచనలు ఇస్తూ, వారితో ప్రాక్టీసు చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. హెడ్‌కోచ్‌గా గంభీర్ ఛార్జ్ చేపట్టాడు అని క్యాప్షన్ ఇచ్చింది.
ఇక శ్రీలంక పర్యటనలో టీమిండియా మొదట మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్,రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్.