మేజర్ లీగ్ క్రికెట్ 2024లో వాషింగ్టన్ ఫ్రీడం ఫైనల్‌కు చేరింది. ఇవాళ (జులై 26) జరిగిన క్వాలిఫయర్‌లో ఆ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. రచిన్ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్ (4-0-46-3), నేత్రావల్కర్ (4-0-23-2), ఫెర్గూసన్ (3.2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో హసన్ ఖాన్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో సునయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది.వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 1, ఆండ్రియస్ గౌస్ (9), రచిన్ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్ బౌలర్లలో హసన్ ఖాన్ 2, పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్ రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది.