వచ్చే ఏడాది ఐపీఎల్‌లో వివిధ జట్లకు యాజమాన్యాలు మారుతున్నాయి. ఆటగాళ్లు, కోచ్‌లు సైతం కొత్త వారు రాబోతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో మంతనాలు సాగిస్తోంది. తాజా గా గుజరాత్ జట్టు వంతైంది. ఈ టీమ్‌పై అదానీ గ్రూప్ కన్నేసింది. గుజరాత్ టైటాన్స్ యజమానులు, CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్ మెజారిటీ వాటాలను విక్రయించడానికి అదానీ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.గుజరాత్ టీమ్‌కు కోచ్‌గా ఉన్న ఆశిష్‌నెహ్రా తప్పుకోనున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ నాటికి ఆశిష్ నెహ్రా- విక్రమ్‌సోలంకి గుజరాత్ టైటాన్స్‌ను విడిచిపెట్టే అవకాశం ఉందన్నది అంతర్గత సమాచారం. ఈ జట్టుకు మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్ వ్యవహరించారు. రీసెంట్‌గా ఆయన పాక్ జట్టుకు కోచ్‌గా వెళ్లిపోయారు. దీంతో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌ను కోచ్‌గా తీసుకోవాలని ఆలోచన చేస్తోందట యాజమాన్యం. దీనిపై యువరాజ్‌సింగ్‌తో మంతనాలు జరుపుతోంది. ఇన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు యువీ. ఇటీవల మాజీ ఆటగాళ్ల మధ్య మ్యాచ్ జరిగింది. అందు లో యువీ టీమ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. దీంతో యాజమాన్యాల చూపు యువరాజ్‌పై పడడం, ఆయనతో గుజరాత్ జట్టు యాజమాన్యం మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది.