టీమ్‌ఇండియా క్రికెట్ చర్రితలో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ''జట్టులోని అత్యుత్తమ సామర్థ్యాన్ని గుర్తించి ప్రపంచానికి చూపించడమే నాయకుడి పని. నా ఏడేళ్ల కెప్టెన్సీలో నేను పశ్చాత్తాపపడిన విషయం ఏదైనా ఉందంటే.. అది సూర్యకుమార్ యాదవ్ ను వినియోగించుకోలేకపోవడమే. కాంబినేషన్లు కుదరకపోవడమే అందుక్కారణం'' అని అన్నాడు. గంభీర్ వ్యాఖ్యలపై సూర్యకుమార్ తాజాగా స్పందించాడు. గతంలో తనపై గంభీర్ చేసిన 'పశ్చాత్తాప వ్యాఖ్యల'పై స్పందిస్తూ ఫన్నీగా బదులిచ్చాడు.గంభీర్‌తో తన బంధం చాలా ప్రత్యేకమైదని స్కై ఈసందర్భంగా తెలిపాడు. ''కొన్నిసార్లు మేం మాట్లాడుకోకుండానే మనసులోని భావాలను ఒకరినొకరం అర్థం చేసుకోగలం. ఈ ప్రయాణం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా'' అని చెప్పాడు. కెప్టెన్సీతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నాడు.