ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. 16 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆగస్టు 11వ తేదీన ముగుస్తాయి. టోక్యో దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది అప్పట్లో.ఇప్పుడు పారిస్ దీనికి వేదిక అయింది. ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యాన్ని ఇవ్వటం వందేళ్ల తరువాత ఇదే తొలిసారి. ఓపెనింగ్ సెలెబ్రేషన్స్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే పారిస్ వర్షం కురిసింది. మధ్యాహ్నం తుంపర్లతో ఆరంభమైన వాన.. గేమ్స్ ఆరంభం అయ్యే సమయానికి జడివానగా మారింది. మొత్తంగా భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.రోయింగ్ కేటగిరీలో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విభాగంలో స్టార్ రోవర్ బాల్‌రాజ్ పన్వర్ నాలుగో స్థానంలో నిలిచాడు. తృటిలో పతకాన్ని కోల్పోయినప్పటికీ.. నిరాశ పడాల్సిన అవసరం రాలేదు. ఆయనకు మరో అవకాశం లభించింది.పురుషుల స్కల్స్ హీట్స్ విభాగంలో బాల్‌రాజ్ పన్వర్.. 07:07.11 సెకెన్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. దీనితో ఆయన రెపిఛేజ్‌కు అర్హత సాధించారు. ఆదివారం మధ్యాహ్నం 1:05 నిమిషాలకు ఆరంభం అయ్యే రెపిఛేజ్‌లో పన్వర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.