టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. పాండ్యాను టీ20 నాయకత్వం తొలగించడం వెనక ఫిట్‌నెస్ ముఖ్యపాత్ర పోషించిందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ''అతడు క్రికెట్‌లో కొనసాగడానికి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. అందుకే వీలైనంత ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలి. అది ఏ మ్యాచ్ అయినా ఫర్వాలేదు. అతడు బలంగా, ఫిట్‌గా ఉన్నట్లు ఫీల్ అయితే.. అప్పుడు అతడు సహజంగానే వన్డేల్లోకి వచ్చేస్తాడు. ఫిట్‌నెస్ విషయంలో సొంతంగానే అంచనా వేసుకోగలడు. ఆ పని మరెవరూ చేయలేరు. తన శరీర భాషను తనకు మించి ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ప్రపంచకప్‌లో రాణించిన విధానం పాండ్యాలో మరింత స్ఫూర్తి నింపుతుందనడంలో ఏ సందేహం లేదు. శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడుతున్నాడు. కీలకమైన రెండో మ్యాచ్లో అతడు బౌలింగ్‌లో 23 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.