ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ (వ్యర్థ పదార్థం) సమస్య చాలా ఎక్కువైంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవితంలో తగినంత చురుకుగా ఉండకపోవడం వల్ల, శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతోంది.అయితే ఆహారం ద్వారా యూరిక్ యాసిడ్ తగ్గించవచ్చు. మనందరి శరీరంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలో దాని స్థాయి పెరిగినప్పుడు అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మూత్రం ద్వారా కీళ్లలో పేరుకుపోయిన ప్యూరిన్‌లను తొలగించే ఆకుపచ్చ కూరగాయలున్నాయి. ఈ కూరగాయలను ఉడికించి, జ్యూస్ కూడా తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం
ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. కిడ్నీ దానిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. కానీ యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఆహారం ద్వారా శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు. దీనికోసం ఆహారంలో సొరకాయను చేర్చుకోవాలి. సొరకాయను రోజూ తింటే యూరిక్ యాసిడ్ స్థాయి అదుపులో ఉంటుంది.
సొరకాయ యూరిక్ యాసిడ్ రోగులకు చాలా ప్రయోజనకరమైన కూరగాయ. విటమిన్ బి, సి, ఐరన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి విటమిన్లు, మినరల్స్ఎముకలను దృఢంగా చేసి సమస్యలను తగ్గిస్తుంది. సొరకాయలో పీచు, నీరు ఉంటాయి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.
యూరిక్ యాసిడ్ రోగులు తక్కువ మసాలాతో సొరకాయను తినాలి. సొరకాయ రసం చేయడానికి పొట్టు తీసి సొరకాయను కట్ చేసి మిక్సీలో రుబ్బుకోవాలి. దీన్ని వడపోసి అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఈ జ్యూస్‌ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా తాగితే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. సొరకాయ పులుసు, సొరకాయ గుజ్జు, సొరకాయ రైతా తినొచ్చు. ఈ విధంగా తింటే శరీరంలో వ్యర్థ పదార్థాల స్థాయి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.