ఆరేళ్ల తర్వాత ప్రారంభమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస చోటుచేసుకుంది. సోమవారం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370.
రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆర్టికల్ 370పై మాటల యుద్ధం జరిగింది.