ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల అధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డిఎస్సీ-1998.. తదితర వాటిపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 -25 ఆర్దిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.