ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన కుంభ తాతారావుకు రూ. 1, 65, 739 చెక్కును అందించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాష్యం జగదీశ్, గణపా కోటిరెడ్డి, నార్ల శ్రీను, సైదేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.