ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు.
cఅలాగే ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల అధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డిఎస్సీ-1998.. తదితర వాటిపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 -25 ఆర్దిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.