కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్ కాదని.. కూటమి పార్టీల మరో మేనిఫెస్టోగా ఉందని షర్మిల విమర్శించారు. ‘కూటమి ప్రవేశపెట్టింది బడ్జెట్టో, మేనిఫెస్టోనో అర్థం కావడంలేదు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ప్రతి యేటా లక్షా ఇరవై వేల కోట్లు అవసరం. సూపర్ సిక్స్‌కు చంద్రబాబు బడ్జెట్‌లో పావువంతు కూడా కేటాయింపులు చేయలేదు. తల్లికి వందనం కింద ప్రతిబిడ్డకూ రూ.15000 ఇవ్వాలంటే బడ్జెట్‌లో పదివేల కోట్లు కేటాయించాలి. మరి కేటాయింపులు లేవంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా?’ అని ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదని, అన్నదాత పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించాల్సి ఉందని షర్మిల అన్నారు.