ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు పేపర్ ద్వారా ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఖాళీ కుర్చీలను చూపించారు. వైసీపీ సభ్యులు ప్రశ్న అడిగారు కానీ, సభకు రాలేదన్నారు. అందుకే వాళ్లు అడిగిన ప్రశ్నను వాయిదా వేస్తున్నానని స్పీకర్ పేర్కొన్నారు.