మహిళల అభ్యున్నతికి, పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ నూతన చైర్పర్సన్ కావలి గీష్మ అన్నారు. గుంటూరులో గురువారం చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రీష్మ మాట్లాడుతూ ‘పదవిలో ఉన్నంత కాలం మహిళల అభ్యున్నతి కోసం పని చేస్తా. మహిళా ప్రాంగణాలను స్వయం ఉపాధికి అనుకూలంగా మారుస్తా’ అని చెప్పారు. ఆమె వెంట తల్లి ప్రతిభా భారతి ఉన్నారు.