ఏపీలో జూన్ 12న కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చి ఆర్నెల్లయిన సందర్భంగా రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేశారు. "రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. గత ఐదేళ్లలో ధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. అయితే... సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోంది. పిచ్చిపిచ్చి రంగులు ఉండవు... మా బొమ్మలు కనిపించవు... పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం. 'రాష్ట్రమే ఫస్ట్... ప్రజలే ఫైనల్' అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తాం" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు