ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం అతిశీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 03:12 PM

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తిరిగి గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఇస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఐదు హామీలను ఇచ్చింది. తాజాగా మహిళలకు రూ.2,100 ఇస్తామని తెలిపింది. ఈ మొత్తాన్ని నేరుగా మహిళ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.ముఖ్యమంత్రి అతిశీతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, అయితే కొంతమంది మహిళలు తన వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా ఈ మొత్తం సరిపోదని చెబుతున్నారని తెలిపారు. వారి అభ్యర్థన మేరకు పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు రెండింతల కంటే ఎక్కువ పెంచినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com