క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య కార్పొరేషన్ సిబ్బంది, ప్రణాళికా అధికారులకు ఆదేశించారు.
ఈ మేరకు భవన నిర్మాణ అనుమతులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించే నిమిత్తం ప్రణాళిక అధికారులు బుధవారం అయ్యన్నపేట, అయ్యప్పనగర్, పూల్బాగ్ ప్రాంతాలలో పర్యటించారు. గంటస్తంభం ప్రాంతంలో నిబంధనలు అతిక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని తొలగించారు.