తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ డైరెక్ట్ ఫ్లైట్లో రాజమండ్రి చేరుకున్నారు.