బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి 20 లక్షలు కేటాయించిందని గురువారం ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) చెప్పారు.
సాంఘిక సంక్షేమ వసతి గృహాల పనులను తక్షణమే చేపట్టి, జనవరి 2025 నెలాఖరుకల్లా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మంజూరు చేసిన సంబంధిత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ధన్యవాదాలు తెలిపారు.