ప్రస్తుతం ప్రజలను పట్టిపీడిస్తున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయనగరం లీడ్ బ్యాంకు మేనేజర్ వి. వి వెంకట రమణమూర్తి తెలిపారు.
బుధవారం ఆయన ఎస్. కోట స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్ దామోదర శ్రీధర్ కు సైబర్ నేరాలపై అవగాహన కలిగిన పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠకులకు ఈ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. సైబర్ నేరాలు కు గురికాకుండా పాఠకులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.