దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో బుధవారం తహసీల్దార్ కే.వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
అనంతరం ఆయన రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. 45 రోజుల్లో ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.