ఎల్ కోట మండలం భీమాలి గ్రామంలో తహసీల్దార్ ప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతు సదస్సులు వినియోగించుకొని రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ మేరకు గ్రామంలో రైతు సదస్సు నిర్వహించి ఆయన రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితర రైతులు పాల్గొన్నారు.