కొత్తవలస మండలం కంటకాపల్లిలో బుధవారం పీహెచ్సీ వైద్యురాలు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కన్సల్టెంట్ వైద్యురాలు ప్రియ పరిశీలించారు.
2025 నాటికి భారతదేశం నుండి క్షయ వ్యాధిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి లక్షణాలను ప్రజలకు వివరించారు. వ్యాధి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని, ఈ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు.