ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. కుమార్తెను కిడ్నాప్ చేసి రూ. 3లక్షలకు అమ్మిన వడ్డీ వ్యాపారి

Crime |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 06:56 PM

గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సబర్కాంత జిల్లాకి చెందిన వడ్డీ వ్యాపారి అర్జున్‌నాథ్ వద్ద.. కొద్దీకాలం కిందట ఓ వ్యక్తి రూ.60 వేలు అప్పుగా తీసుకున్నాడు.
వడ్డీతో కలిపి రూ.3 లక్షలు అయిందని, మొత్తం తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారి డిమాండ్ చేశాడు. అనంతరం అతడి ఏడేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి.. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 19న రూ.3 లక్షలకు అమ్మేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను కాపాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com