పండుగల నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు గిఫ్ట్లు అందిస్తుంటాయి. అయితే చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన ఉద్యోగులకు అదిరే గిఫ్ట్లు ఇచ్చి ఆశ్చర్య పరిచింది.
పనిలో ప్రతిభ కనబరిచిన 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను బహుమతులుగా అందజేసింది. ఉద్యోగులను ప్రోత్సహించడానికే బహుమతులు అందజేసినట్లు కంపెనీ పేర్కొంది.