అన్నమయ్య విగ్రహం తలపై శాంతాక్లాజా టోపీ పెట్టిన వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 23 మధ్యాహ్నం అన్నమయ్య కూడలిలోని విగ్రహం తలపై అన్యమతానికి చెందిన టోపీ పెట్టినట్లు విష్ణుప్రతీక్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో నాలుగు పోలీసులు బృందాలు దర్యాప్తు చేపట్టి సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించాయి. తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అతడ్ని అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడ్ని మహారాష్ట్ర పర్బాని తాలూకా ఫెడ్గోన్ గ్రామానికి చెందిన బంధు ధార్జి జవనార్ (73) గా గుర్తించారు.. హిందువైన జవనార్.. దేశంలోని ఆలయాలు తిరుగుతుంటారని, 15 రోజుల కిందట తిరుపతికి వచ్చారు. ఇక్కడ చిత్తు పేపర్లు ఏరుకుంటూ ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్నాడు. అన్నమయ్య కూడలి సమీపంలో శాంతాక్లాజ్ టోపీ దొరకగా.. దాన్ని అన్నమయ్య విగ్రహం తలపై ఉంచాడు.