జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఏపీ తరపున ఈ పోటీల్లో పాల్గొనేందుకు వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. స్వయంగా క్రీడాకారుల ప్రతిభను పరిశీలిస్తున్నామని అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రోత్సాహకం లేక రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారన్నారు.
ఏపీ నుంచి వాలీబాల్ టీంను నేషనల్ గేమ్స్‌కు ఎంపిక చేయడానికి జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వాలీబాల్‌లో గొప్ప మెడల్స్ సాధించిన క్రీడాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా ప్రోత్సాహం కరవైందని చెప్పారు. ఓపెన్ సెలక్షన్లు పెట్టి జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక చేస్తున్నామని అన్నారు. నేషనల్ టీం సమక్షంలో బాగా ఆడిన రాష్ట్ర క్రీడాకారులనే జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు.