ఏపీ ప్రభుత్వం అరోగ్య శ్రీ నిర్వహణలో కీలక మార్పులకు సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు ఆరోగ్య శాఖపై తాజాగా చేసిన సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి.
ఇక నుంచి ఆరోగ్య శ్రీ సేవల నిర్వహణలో భీమా కంపెనీల భాగస్వామ్యం గురించి చర్చించారు. వైద్య సేవల్లోనూ కొత్త విధానాలు అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. హెల్త్ కార్డుల జారీపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.