జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని భారత ఆర్మీ తెలిపింది. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. అంటే మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని అధికారులు చెప్పారు.
ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలైన ఉధంపూర్, కథువా, దోడా, జమ్మూ, రాజౌరిలో 42 మంది మరణించారు. వీళ్లలో ఎక్కువమంది స్థానికేతర ఉగ్రవాదులు ఉన్నారనే విషయం బయటపడిందని పేర్కొన్నారు.