అమెరికా డాలరుతో పోలిస్తే మన దేశ కరెన్సీ రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి (85.27)కి చేరుకోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. 2014లో ఇదే అంశంపై నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ విమర్శలు గుప్పించారని, రాజకీయ ప్రయోజనాల కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రస్తుతం రూపాయి విలువ క్షీణత విషయంలో ప్రధాని మోదీ వద్ద ఎటువంటి మాటలు లేవని ట్వీట్ చేశారు.