ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా విద్యుత్ కారును ఆవిష్కరించింది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 వేదికగా దీన్ని జనవరి 17న విడుదల చేయనుంది.
ఈ క్రమంలోనే కారు లుక్‌ను, ఇతర వివరాలను వెల్లడించింది. క్రెటా ఈవీ ద్వారా ఈవీ సెగ్మెంట్‌లో టాటా కర్వ్, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్ ఈవీ వంటి కార్లకు హ్యుందాయ్ పోటీ ఇవ్వనుంది.