ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో సెకను పాటు భూప్రకంపనలు వచ్చాయి. గతేడాది డిసెంబర్ 24న ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు, శంకరాపురం, వేంపాడులో సెకను పాటు భూమి కంపించింది.
అదేరోజు రాత్రి 8.15, 8.16, 8.19 గంటల సమయాల్లో తాళ్లూరు మండలం విఠలాపురంతోపాటు ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు, మారెళ్ల, పసుపుగల్లు, శంకరాపురం, వేంపాడు గ్రామాల్లో సెకను పాటు ప్రకంపనలు వచ్చాయి.