శ్రీశైల మల్లన్న దర్శన ప్రక్రియలో సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్నవారికి స్పర్శ దర్శనం కల్పిస్తూ రూ.వేలు జేబుల్లో వేసుకొంటున్నారని అంటున్నారు.
ఆలయంలో పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా అధికారులు దృష్టిపెట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.