ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని టెక్కలి సీఐ ఏ. విజయ్ కుమార్ సూచించారు. గురువారం టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద ఉన్న ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యే విధంగా ప్రధాన రోడ్డుపై ఆటో సీరియల్స్ పెట్టకూడదని అన్నారు. నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. ఈ మేరకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.