కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటిస్తోన్నారు. సీకే దిన్నె మండలం బుగ్గలపల్లిలో ఆయన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు.
మహిళలు, గర్భిణులు, చిన్నారులకు అందుతున్న పోషకాహారాన్ని గురించి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకం లబ్ధిదారులతో జితేంద్ర సింగ్ మాట్లాడారు.