ఏపీలో ఏడు నెలల చంద్రబాబు పాలన ప్రజలను ఏడిపించే పాలనగా కొనసాగిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోయిందని తెలిపారు.
అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. 50శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని అన్నారు. కూటమి నాయకుల మోసాలకు రాష్ట్ర ప్రజలు బలయ్యారని వెల్లడించారు.