దేశంలో పదేళ్లలో ఉపాధి శాతం పెరిగిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. 2014-15లో 47.15 కోట్ల మంది ఉద్యోగులు ఉండగా.. 2023-24 నాటికి 36 శాతం.
పెరుగుదల నమోదై 64.33 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. 2004-14 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వం 2.9 కోట్ల ఉద్యోగాలే సృష్టించగా.. గత పదేళ్లలో ఎన్డీయే సర్కారు 17.19 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని వెల్లడించారు.