ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో కొద్దిసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన పలు పథకాలపై సీఎం చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రూ.20,000 ఆర్థిక సాయాన్ని ఒకేసారి చెల్లించే అంశంపై చర్చ జరిపారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంపై చర్చించారు.