ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 09:02 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 100 ఏళ్ల వయసు కల్గిన జిమ్మీ.. గత కొంతకాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈక్రమంలోనే ఈరోజు ఉదయం తన స్వగృహమైన జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఏ ఒక్కరూ కూడా ఇంతకాలం పాటు బతకలేదు. ఇలా ఎక్కువ సంవత్సరాలు జీవించిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన ఈయన.. నేడు చనిపోవడంతో దేశంలోని ప్రముఖులు అంతా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1924వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జన్మించిన జిమ్మీ కార్టర్.. 1976 అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అలా 1977వ సంవత్సరం నుంచి 1981 వరకు 39వ అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఓ రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్‌గా, ప్రెసిడెంట్‌గా ఇలా ఎన్నో రకాల పదవుల్లో ఆయన చరిత్ర సృష్టించారు. మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా 1978లో ఇజ్రాయెల్ - ఈజిప్టు దేశాల మధ్య మధ్యవర్తిగా పని చేసి శాంతి ఒప్పందాన్ని నెలకొల్పారు.


ప్రజాస్వామ్యంతో పాటు మానవ హక్కులను చక్కగా అమలు చేసి ముందుకు తీసుకు వెళ్లిన ఈయన కృషికి గాను.. 2002లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇదంతా ఇలా ఉండగా.. గత కొన్నేళ్లుగా ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రాణాంతక కేన్సర్‌ను కూడా జయించిన ఈయన ఈమధ్య చాలా బలహీనంగా మారిపోయారు. ముఖ్యంగా 2003 నవంబర్ 19వ తేదీన జిమ్మీ కార్టర్ భార్య రోసలిన్ కార్టర్ మృతి చెందగా.. వీల్‌ఛైర్‌లో కూర్చుని మరీ ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అప్పుడు జిమ్మీ చాలా బలహీనంగా కనిపించారు.


చాలా రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఈయన.. ఈరోజు ఉదయం స్వగృహంలోనే ప్రాణాలు కోల్పోయారు. జిమ్మీ కార్టర్ మృతి విషయం తెలుసుకున్న అమెరికా ప్రముఖులు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ బిల్.. జిమ్మీ కార్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అంతేకాకుండా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, మానవ హక్కుల అభివృద్ధికి జిమ్మీ కార్టర్ ఎంతగానో కృషి చేశారని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. మరోవైపు కాబోయే అధ్యుక్షుడు ట్రంప్ సైతం జిమ్మీ మృతి పట్లం సంతాపం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com