పల్లె పండుగలో భాగంగా వెల్దుర్తిలో బుధవారం రూ. 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజమైన అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబు ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు. గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. గ్రామాలలో మౌలిక వసతులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు.